LPG Cylinder Rate | కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై రూ.99.75 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని కంపెనీలు పేర్కొన్నాయి.
వాణిజ్య ధరలు తగ్గినా.. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరుగలేదు. తాజాగా మారిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ దర రూ.1,680కి చేరింది.
చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంధన ధరలు, సిలిండర్ల ధరలను సమీక్షిస్తూ వస్తుంటాయి. ఇటీవల వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గుతున్నా.. డొమెస్టిక్ గ్యాస్ ధరలు మాత్రం తగ్గలేదు.
పెరిగిన ఏటీఎఫ్ ధరలు
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధరలను చమురు సంస్థలు మరోసారి పంచాయి. వీటి ధరలు పెరుగడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.
తాజాగా పెంచిన ధరతో ఏటీఎఫ్ ధర కిలో లీటర్‌కు రూ. 98,508.26కి చేరింది. కోల్‌కతాతో పాటు పలు ఇతర నగరాల్లో ఈ రేటు రూ.1,07,383.08 ఉండగా.. ముంబయిలో ఏటీఏఫ్ ప్రైజ్ రూ.92,124.13 ఉండగా.. చెన్నైలో రూ.1,02,391.64 పలుకుతున్నది.
వరుసగా నాలుగు నెలలు పడిపోయిన ఏటీఎఫ్ ధరలు జులైలో ఒకేసారి 1.65శాతం పెరిగాయి. తాజాగా పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నది. ఏటీఎఫ్ ధరల పెరుగుదలతో విమాన ఛార్జీలను సైతం పెంచే అవకాశాలున్నాయి. దీంతో ప్రయాణికులపై భారపడనున్నది.