Site icon vidhaatha

LPG Hike | షాక్‌ ఇచ్చిన చమురు కంపెనీలు.. సిలిండర్‌ ధర రూ.200పైగా పెంపు

LPG Hike | చమురు కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్‌ ధరలను శనివారం భారీగా పెంచాయి. ఆదివారం నుంచి పెంచిన ధరలు అందుబాటులోకి వచ్చాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా రూ.209 పెంచింది. పెరిగిన ధరతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.1731.50కి చేరింది.



అయితే, ఇటీవల సిలిండర్‌ ధరలను రూ.10.. రూ.20 వరకు తగ్గిస్తూ వచ్చిన కేంద్రం ఒకేసారి రూ.209 వరకు పెంచడం గమనార్హం. పెంచిన ధరతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.209 పెరిగి రూ.1731.50కి చేరింది. ఇక కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684కి చేరింది. మరో వైపు కేంద్రం సామాన్యులకు ఊరటనిచ్చింది.



డెమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆగస్టు 30న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. అప్పటి నుంచి అదే ధర కొనసాగుతున్నది. అయితే, దేశంలో పండగ సీజన్‌ ప్రారంభంకావడంతో నవంబర్‌ నెలలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తున్నది.

Exit mobile version