ధ‌ర‌ల మంట‌కు గ్యాస్ తోడు.. త‌ల‌కిందుల‌వుతున్న వంటింటి బ‌డ్జెట్‌

విధాత‌: అస‌లే పెరుగుతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడిపై.. వంట‌గ్యాస్ (LPG) రూపంలో మ‌రో పిడుగు ప‌డింది. సిలిండ‌ర్ ధ‌ర రూ.50 పెర‌గ‌డంతో హైదరాబాద్‌లో నాన్‌-స‌బ్సిడీ సిలిండ‌ర్ (14.2 కిలోలు) రేటు రూ.1,155కు చేరింది. 7 నెల‌లుగా స్థిరంగా ఉన్న వంట‌గ్యాస్ ధ‌ర‌.. బుధ‌వారం పెరిగింది. గ‌త ఏడాది జూలైలో చివ‌రిసారిగా సిలిండ‌ర్‌పై రూ.43 పెంచారు. దీంతో రూ.1,105కు చేర‌గా, తాజా వ‌డ్డింపుతో రూ.1,155కు వెళ్లింది. ఇప్ప‌టికే పెట్రోల్‌ (PETROL), డీజిల్ (DIESEL) ధ‌ర‌ల సెగ‌తో […]

  • Publish Date - March 1, 2023 / 08:48 AM IST

విధాత‌: అస‌లే పెరుగుతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడిపై.. వంట‌గ్యాస్ (LPG) రూపంలో మ‌రో పిడుగు ప‌డింది. సిలిండ‌ర్ ధ‌ర రూ.50 పెర‌గ‌డంతో హైదరాబాద్‌లో నాన్‌-స‌బ్సిడీ సిలిండ‌ర్ (14.2 కిలోలు) రేటు రూ.1,155కు చేరింది. 7 నెల‌లుగా స్థిరంగా ఉన్న వంట‌గ్యాస్ ధ‌ర‌.. బుధ‌వారం పెరిగింది. గ‌త ఏడాది జూలైలో చివ‌రిసారిగా సిలిండ‌ర్‌పై రూ.43 పెంచారు. దీంతో రూ.1,105కు చేర‌గా, తాజా వ‌డ్డింపుతో రూ.1,155కు వెళ్లింది.

ఇప్ప‌టికే పెట్రోల్‌ (PETROL), డీజిల్ (DIESEL) ధ‌ర‌ల సెగ‌తో ర‌వాణా భార‌మై కూర‌గాయ‌ల ద‌గ్గ‌ర్నుంచి పాలు, పెరుగు, పండ్లు, మాంసం, గుడ్లు, చేప‌లు, ప‌ప్పు దినుసులు, వంట‌నూనెలు త‌దిత‌ర కిరాణా స‌రుకుల ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. ఇప్పుడు చ‌మురు మార్కెటింగ్ సంస్థ‌ల నిర్ణ‌యంతో వంట‌గ్యాస్ ధ‌ర కూడా పెరగ‌డంతో వంటింటి బ‌డ్జెట్ మ‌రింత ఒత్తిడికి లోన‌వుతున్న‌ది.

మ‌రోవైపు వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర కూడా భారీగానే పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ.350.50 పెరిగింది. దీంతో రేటు రూ.2,119.5ను తాకింది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ.1,103గా ఉన్న‌ది.

ఎన్నిక‌ల‌ప్పుడైతే త‌గ్గిస్తారా..

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తోపాటు వంట‌గ్యాస్ ధ‌ర‌ ఎన్నిక‌ల స‌మయంలో త‌గ్గుతున్నాయ‌ని, ఆ ఎన్నిక‌లు ముగిస్తే మ‌ళ్లీ పెరుగుతున్నాయ‌ని సామాన్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ధ‌ర‌ల‌ను త‌గ్గించే బాధ్య‌త ప్ర‌భుత్వాల‌ది కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. క‌రోనా ప‌రిస్థితుల‌ ప్ర‌భావంతో జీతాలు పెర‌గ‌డం లేద‌ని, కానీ ఖ‌ర్చులు మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతూపోతున్నాయ‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. వంట‌గ్యాస్‌తోపాటు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Latest News