Site icon vidhaatha

నల్గొండలో టీడీపీని బలోపేతం చేస్తాం: ఎల్వీ యాదవ్

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు ఎల్వీ యాదవ్ అన్నారు. మంగళవారం నల్గొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 20 మంది మహిళలు, కార్మికులు టీడీపీలో చేరారు. వారందరికీ పసుపు కండువాలు కప్పిన అనంతరం, ఎల్వీ యాదవ్ మాట్లాడారు.


తెలుగుదేశం పార్టీ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో పోతరాజు నాగరాజు, జనార్దన్ రెడ్డి, బొజ్జ కమలమ్మ, భారతమ్మ, దుర్గమ్మ, కొంగల జయమ్మ, బల్గురి బాలమ్మ, గండికోట లక్ష్మమ్మ, ఓసు ఇస్తోరి, బూతం మంజుల ఉన్నారు.

Exit mobile version