Mahaboobnagar
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఒకే రోజు 44 కాన్పు లు జరిగాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ తెలిపారు.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లానుంచి వచ్చిన 44 మహిళలకు సురక్షి తంగా కాన్పు లు జరిగినట్లు అయన పేర్కొన్నారు. అందులో 23 మందికి సాధారణ కాన్పులు, 21 మందికి సేజే రియన్ ద్వారా కాన్పులు చేశామన్నారు.
గత రెండేళ్ల క్రితం ఇదే ఆసుపత్రి లో ఒకే రోజు 37 కాన్పు లు జరిగానని, ప్రస్తుతం 44 కాన్పు లు జరగడం ఆసుపత్రి చరిత్ర లో ఇది రికార్డ్ అని రాంకిషన్ వెల్లడించారు. ఈ సందర్బంగా మహిళా వైద్యులను ఆయన అభినదిం చారు.