Site icon vidhaatha

Major Encounter In AP: ఏపీలో భారీ ఎన్‌కౌంటర్

ఆజాద్‌తో సహా ముగ్గురు మృతి
మావోయిస్టులకు ఎదురుదెబ్బలు

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి తూర్పుగోదావరి మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ ఆజాద్ , ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, మరొకరు అంజు మృతి చెందారు. ఈ సందర్భంగా ఒక ఏకే 47 ఆయుధాన్ని స్వాధీనంచేసుకున్నారు. ఈ ప్రాంతంలో మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు గ్రే హౌండ్స్‌కి సమాచారం అందడంతో కూంబింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందుతున్నారు.

– చనిపోయిన మావోయిస్టుల వివరాలు.

గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్
గణేష్ అలియాస్ బిరుసు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఆయన పై రూ. 25 లక్షలు రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు, ఏవోబీ స్పెషల్ జోనల్ మెంబర్‌గా ఉన్నారు. గాజర్ల కుటుంబానికి మావోయిస్టు పార్టీ కుటుంబంగా గుర్తింపు పొందారు.

వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్ అరుణ….అలియాస్ రూపీ.(54)  కరక వాణి పాలెం పెందుర్తి మండలం విశాఖ జిల్లాకు చెందినవారు. ఆమెపై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్. ఏవోబీ మెంబర్‌గా పనిచేస్తున్నారు.
ఇతని తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందారు. ఈమె తల్లి మావి నేత గతంలో మృతి చెందారు. మావోయిస్టు పార్టీ సీసీ మెంబర్ చలపతి ఈమె భర్త, చంద్రబాబు పై అలిపిరి వద్ద జరిగిన దాడి ఘటనలో కీలక వ్యక్తి, కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం దగ్గరలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.అరుణ పై విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావు…తో పాటు మరో ఎమ్మెల్యే హత్య కేసులున్నాయి.

Exit mobile version