CM Mamata | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన కానుక పంపించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన బెంగాల్ మామిడి పండ్లను మోదీకి పంపించారు మమత.
మోదీకి మాత్రమే కాదు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు కూడా మమత మామిడి పండ్లు పంపించారు.
ఇక మామిడి పండ్లను ప్రత్యేకంగా తయారు చేసిన డెకరేటివ్ బాక్సుల్లో పంపించారు. మమత పంపిన మామిడి పండ్లలో హిమ్‌సాగర్, ఫజ్లి, లంగ్రా, లక్ష్మణ్ భోగ్ వంటి వెరైటీలు ఉన్నాయి.