విధాత: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ సీటులో కూర్చోబోయి కిందపడ్డారు. ఈ ఘటన పశ్చిమ్ బర్దమాన్ జిల్లాలోని దుర్గాపూర్ వద్ద జరిగింది. హెలిక్యాప్టర్లోకి ప్రవేశించిన తర్వాత సీటులో కూర్చోబోయే క్షణంలో మమతా బెనర్జీ తుళ్లి పడ్డారు. ఆమెకు స్వల్పస్థాయిలో గాయాలు అయ్యాయి. భద్రతా సిబ్బంది ఆమెను వెంటనే పైకి లేపారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు ఆమె అసన్సోల్ బయలుదేరి వెళ్లారు. మమతకు ఇటీవలే నుదుటికి గాయమైంది. ఆ వెంటనే మరోసారి ఆమె కింద పడింది. అయితే ఈసారి పెద్దగా గాయాలేమి కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.
హెలిక్యాప్టర్‌లో కింద పడ్డ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ సీటులో కూర్చోబోయి కిందపడ్డారు. ఈ ఘటన పశ్చిమ్ బర్దమాన్ జిల్లాలోని దుర్గాపూర్ వద్ద జరిగింది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు