Site icon vidhaatha

Marriages | గిన్నిస్ రికార్డు.. 12 గంట‌ల్లో 2,413 జంట‌ల‌కు వివాహాలు

Marriages |

హిందూ సంప్ర‌దాయంలో చాలా వ‌ర‌కు పెళ్లి వేడుక‌ల‌ను ఐదు రోజుల పాటు కొన‌సాగిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల్లో, మ‌రికొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల్లో పెళ్లి తంతు ముగించేస్తారు. మ‌రి ఒక్క రోజులో, ఒక్క గంట‌లో ముగించే పెళ్లిళ్లు కూడా అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తున్నాయి. అలా 2,413 జంట‌ల‌కు 12 గంట‌ల్లో సామూహిక వివాహాలు జ‌రిపించారు. ఈ సామూహిక వివాహాల వేడుక గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.

రాజ‌స్థాన్‌ల‌ని బ‌రాన్‌లో శ్రీ మ‌హ‌వీర్ గోశాల క‌ల్యాణ్ సంస్థాన్ వారు స్థానికంగా ఉన్న నిరుపేద హిందూ, ముస్లిం కుటుంబాల్లోని యువ‌తీ యువ‌కుల‌కు సామూహిక వివాహాలు జ‌రిపించారు. ఈ ఏడాది మే 26వ తేదీన 12 గంట‌ల వ్య‌వ‌ధిలో 2,413 జంట‌ల‌కు పెళ్లిళ్లు చేసి రికార్డు సృష్టించారు.

అంతేకాదు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లోకి కూడా ఈ సామూహిక వివాహాలు ఎక్కాయి. 2013లో 24 గంట‌ల్లో 963 జంట‌ల‌కు వివాహాలు చేసిన రికార్డును రాజ‌స్థాన్‌లో జ‌రిగిన సామూహిక వివాహాలు చెరిపేశాయి.

ఇక హిందూ జంట‌ల‌కు బ్రాహ్మ‌ణులు, ముస్లిం జంట‌ల‌కు ఖాజీలు పెళ్లిళ్లు చేశారు. త‌ద‌నంత‌రం ప్ర‌భుత్వం త‌ర‌పున నూత‌న వ‌ధూవ‌రులుంద‌రికి వివాహ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్‌ను కూడా అందించారు. నూత‌న జంట‌లు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేబినెట్ మినిస్ట‌ర్ జైన్ భ‌యా ఆశీర్వాదం తీసుకున్నారు.

నూత‌న వ‌ధూవ‌రుల‌కు పెళ్లి కానుక‌గా.. పెళ్లికుమార్తెకు ఆభ‌ర‌ణాలు, బెడ్, వంట సామాను, టీవీ, ఫ్రిజ్, కూల‌ర్, ఇండ‌క్ష‌న్ కుక్క‌ర్ వంటి సామాగ్రిని అందించారు. ఇక నూత‌న వ‌ధూవ‌రుల‌తో పాటు వారి వెంట వ‌చ్చిన బంధువులంద‌రికీ నిర్వాహ‌కులు రుచిక‌ర‌మైన భోజ‌నం వ‌డ్డించారు.

Exit mobile version