Burkina Faso: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫోసోలో అల్ ఖైదా అనుబంధ జిహాదీ మూకలు ఉచకోతకు పాల్పడ్డారు. జిహాదీ మూకల దాడిలో 100మందికి పైగా మరణించారు. వారిలో చాలా మంది సైనికులు, సహాయ సిబ్బంది ఉన్నారు. మరణించిన వారిలో స్థానికులు, కార్మికులు కూడా ఉన్నారు.
డజిబో పట్టణం సహా పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా ఉగ్ర మూకలు దాడులకు పాల్పడ్డాయి. బుర్కినా ఫోసో వైమానిక దళం లక్ష్యంగా జిహాదీల ఒకేసారి ఎనిమిది ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. స్పెషల్ యాంటీ టెర్రరిజం సైనిక శిబిరాలపై దాడులు చేసి ఊచకోతకు పాల్పడ్డారు. ఈ నరమేధానికి మాదే బాధ్యత అని అల్ ఖైదా అనుబంధ గ్రూస్ జేఎన్ఐఎం ప్రకటించుకుంది.
ఆఫ్రికాలోని 11దేశాల భూభాగాలతో కూడిన సహెల్ ప్రాంతంలో 2.3కోట్ల జనాభా ఉన్న బుర్కినా ఫోసో దేశం కూడా ఒకటి. సగానికి పైగా భూభాగంపై సైనిక ప్రభుత్వం పట్టు కోల్పోగా..ఈ దేశాన్ని కబళించేందుకు అల్ ఖైదా ఉగ్ర సంస్థలు నిత్యం దాడులు సాగిస్తున్నాయి. అటు దేశ భద్రతా దళాలు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో సంక్షోభం మరింత ముదురుతుంది.