Site icon vidhaatha

South Africa | సౌతాఫ్రికాలో భారీ అగ్నిప్ర‌మాదం.. 63 మంది స‌జీవ‌ద‌హ‌నం

South Africa |

సౌతాఫ్రికాలోని జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో గురువారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. దీంతో 63 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మ‌రో 43 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారి ప‌రిస్థితి కాస్త విష‌మంగానే ఉంద‌ని ఎమ‌ర్జెన్సీ మేనేజ్‌మెంట్ స‌ర్వీస్ అధికారి వెల్ల‌డించారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌ నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. కాలిన గాయాల‌తో బాధ‌ ప‌డుతున్న 43 మందిని స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version