విధాత, వరంగల్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 18వ తేదీన వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు stray వేకెన్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి అదే రోజు రాత్రి 9 గంటల వరకు వెబ్ ఆఫ్షన్లు నమోదు చేసుకోవాలి. అర్హత, నిబంధనలు ఇతర సమాచార వివరాలకు http://www.knruhs.telangana.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి.
రేపు జరుగనున్న ఎంబీబీఎస్ యాజమాన్య కోటా stray వేకెన్సీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇప్పటికే జారీ చేసిన stray వేకెన్సీ కౌన్సిలింగ్ ప్రకటనను ఉపసంహరించుకుంది
త్వరలో కౌన్సెలింగ్ కు సంబంధించి మరో ప్రకటన జారీ చేస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది