రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: అద‌న‌పు క‌లెక్ట‌ర్‌

రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో సంబంధిత అధికారుల‌కు ఆదేశం విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహ‌దారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజినీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఇంజినీరింగ్, పోలీసు అధికారులనుద్దేశించి మాట్లాడారు. ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో పాటు క్షతగాత్రులు మృత్యువాత పడుతుండడం బాధాకరమని అన్నారు. రోడ్డు […]

  • Publish Date - December 16, 2022 / 03:23 PM IST
  • రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో సంబంధిత అధికారుల‌కు ఆదేశం

విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహ‌దారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజినీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఇంజినీరింగ్, పోలీసు అధికారులనుద్దేశించి మాట్లాడారు.

ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో పాటు క్షతగాత్రులు మృత్యువాత పడుతుండడం బాధాకరమని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలతో పాటు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు తు.చ. తప్పక పాటిస్తే ప్రమాదాలు నివారించడంతో పాటు ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా నివారించగలిగిన వారమవుతామని అన్నారు.

రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణాలు అధికంగా మలుపులు ఉండడం, ప్రమాద హెచ్చరికలు, స్పీడ్ నియంత్రణ సూచికలు, స్పీడ్ బ్రేకర్లు అవసరమైన చోట లేకపోవడం, యూ టర్న్ మలుపులు కనిపించకపోవడం, డ్రైవర్ల తప్పిదాలు, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటివని అన్నారు.

మనోహరాబాద్ నుండి తూప్రాన్, చేగుంట, రామాయంపేట జాతీయ రహాదారితో పాటు నరసాపూర్ -మెదక్ రహ‌దారి వెంట గుర్తించిన బ్లాక్ స్పాట్ ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ రహ‌దారులు, ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు.

పెద్దశంకరంపేట అంకోలా జాతీయ రహ‌దారి పెట్రోల్ బంక్ వద్ద యు టర్న్ ఏర్పాటు చేయాలని, అల్లాదుర్గ్, బోడమటపల్లి సర్వీస్ రోడ్డు అనుసంధానం చేయాలని, జమ్మికుంట వద్ద ఇరుకుగా ఉన్న వంతెన వద్ద లైటింగ్ ఉండేలా చూడాలని రమేష్ సూచించారు.

రహదారులపై రక్షణగా ఏర్పాటు చేసిన సైడ్ గ్రిల్ తొలగించ వద్దని, పశువులు రోడ్లపై తిర‌గ‌కుండా చూడాలని లేకుంటే జరిమానా విధించడంతో పాటు శిక్ష పడుతుందని ప్రజలలో అవాహ‌గాహన కలిగించాలని అధికారులకు సూచించారు. నర్సాపూర్ నుండి కొల్చారం మధ్య క్షతగ్రాతులను తక్షణ వైద్య సహాయం నిమిత్తం అంబులెన్స్, రహదారుల వెంట బయో వాష్ రూమ్ లు ఏర్పాటు చేయాలని, రోడ్డు మసకగా ఉన్న ప్రాంతాలలో హై మాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

అవసరమైన ప్రాంతాలలో రేడియం సైన్ బోర్డులు, సి.సి. కెమెరాల ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులకు సూచంచారు. బంగారమ్మ దేవాలయం, కూచారం వద్ద పసుపుచార‌లు ఏర్పాటు చేయాలని, చెట్ల తిమ్మాయిపల్లి, వడియారం బై పాస్ రోడ్ల దగ్గర హై మాస్ట్‌ లైట్లు వెలిగేలా చూడాలన్నారు.

నర్సాపూర్- మెదక్ రహ‌దారిలో అవసరమైన ప్రాంతాలలో రుంబుల్ స్ట్రిప్స్ వేయాలని, మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు దగ్గర రహదారిని సరిచేస్తూ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ఉన్నత స్థాయిలో అనుమతులు, నిధుల మంజూరుకు పంపిన ప్రతిపాదనలు అందజేస్తే తగు చర్య తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు.

సమావేశంలో జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, ఆర్ అండ్ బి డీఈఈ వెంకటేశం, జాతీయ ప్రాధికార సంస్థ మేనేజర్ తరుణ్ కుమార్, హైవే సీనియర్ ఇంజనీర్ ఏడుకొండలు, కిరణ్ కుమార్, లక్సమం, జిల్లా ఆబ్కారీ అధికారి రజాక్ , సి.ఐ. మధు, ఎస్ ఐలు తదితరులు పాల్గొన్నారు.