Medak: కార్యకర్తలే పార్టీకి బలం.. బలగం: ఆత్మీయ సమ్మేళనంలో MLA పద్మా దేవేందర్ రెడ్డి

పాల్గొన్న ఎమ్మెల్సీ మల్లేశం.. విధాత, మెదక్ బ్యూరో: బీఆర్‌యస్ పార్టీ కి కార్యకర్తలే బలం, బలగం అని వారి కష్ట సుఖాలలో పార్టీ కొండంత అండగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. బుధ‌వారం మండల కేంద్రమైన పాపన్న పేటలో మంజీరా గార్డెన్ లో రెండవ విడత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై యేండ్ల పాలనలో పాలకులు చేయని అభివృద్ధి ముఖ్యమంత్రి కెసిఆర్ 8 ఏళ్ళ లో చేశారని […]

  • Publish Date - April 19, 2023 / 07:17 AM IST

  • పాల్గొన్న ఎమ్మెల్సీ మల్లేశం..

విధాత, మెదక్ బ్యూరో: బీఆర్‌యస్ పార్టీ కి కార్యకర్తలే బలం, బలగం అని వారి కష్ట సుఖాలలో పార్టీ కొండంత అండగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. బుధ‌వారం మండల కేంద్రమైన పాపన్న పేటలో మంజీరా గార్డెన్ లో రెండవ విడత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై యేండ్ల పాలనలో పాలకులు చేయని అభివృద్ధి ముఖ్యమంత్రి కెసిఆర్ 8 ఏళ్ళ లో చేశారని అన్నారు.

రైతు వ్యతరేక చట్టాలను ఎండగట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బోరుబావుల వద్ద మీటర్లు బిగించాలని ప్రయత్నం చేస్తే వారి కుటల ప్రయత్నాన్ని తిప్పి పంపారని రైతులకు నష్టం కల్గించే ఏ పార్టీ బాగుపడదన్నారు. బోరు బావుల మీటర్లు బిగిస్తే వచ్చే బిల్లుల ద్వారా రాష్ట్రానికి కోట్లు ఇస్తామని చెబితే మీ కోట్లు వద్దు మా రైతులకు నష్టం చేసే మీటర్లు వద్దు అని రైతు సంక్షేమం కోసం కెసిఆర్ కృషి చేస్తున్నార‌న్నారు.

అనంతరం ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నాలుగోసారి గెలుపు ఖాయమని కార్యకర్తల అభిమానం చూస్తే ఇట్టే అవగతం అవుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగన్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు కుబేర్, రైతు బందు జిల్లా అధ్యక్షులు సోములు, ఇఫ్కొ డైరక్టర్ దేవేందర్ రెడ్డి, పాపన్న పేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మండల రైతు బంధు కోఆర్డినేటర్ గడిల.శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సర్పంచులు రాణి కిష్టయ్య, ప్రమీల గోపాల్ రెడ్డి, బుజ్జమ్మ అషయ్య, కవిత రవీందర్, వెంకట్ రాములు, మల్లేశం, స్రవంతి శ్రీనివాస్, కిషన్, సుదర్శన్, లింగా రెడ్డి, సంగప్ప, తిరుపతి రెడ్డి, నవీన్, లక్ష్మి దుర్గయ్య, దాసు, మండల కోప్శన్ సభ్యులు గౌస్, ఏడుపాయల చైర్మన్ బాలా గౌడ్, దానయ్య,అంజయ్య, కో ఆపరేటివ్ చైర్మన్లు మల్లేశం,దత్తు రాజ్, మాజీ పాలక మండలి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు దుర్గయ్య, సుభాష్ గౌడ్, ఇమానియల్, బాబా గౌడ్, బాబర్, తోపాటు వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News