Site icon vidhaatha

IT Rides | ఆందోళన, నిర‌స‌న‌లు చేయొద్ద‌ని కార్య‌క‌ర్త‌ల‌కు ఫైళ్ల సూచ‌న‌

IT Rides

విధాత: హైదరాబాద్ కొత్తపేట్ గ్రీన్ హీల్స్ కాలనీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతుండగా, ఇంటి ముందు పార్టీ శ్రేణుల ఆందోళనలు కొనసాగాయి. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని చూపించాలని అభిమానులు, కార్యకర్తల ఐటి అధికారులను డిమాండ్ చేశారు. వారి ఆందోళనను కిటికీలోంచి చూసిన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేశారు.

ఇంటి వద్ద ఎలాంటి ఆందోళన చేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఐటీ రైడ్స్ ఎప్ప‌టి వరకు పూర్తి అవుతాయో చెప్పాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కోరారు. ఐటి రైడ్స్ ఎప్పుడు పూర్తి అవుతాయో తనకు సమాచారం లేదని తెలిపిన ఎమ్మెల్యే ఫైళ్ల , ఐటీ కి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేయవద్దని కార్యకర్తలకు సూచించారు.

Exit mobile version