Site icon vidhaatha

Wrangal: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: దాస్యం

విధాత, వరంగల్: ప్రత్యేక ప్రతినిధి: బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలతో గురువారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు లీడర్లకు మధ్య సఖ్యతనూ పెంపొందించేందుకు ఆత్మీయ సమ్మేళనం దోహదప‌డుతుంద‌న్నారు. ఇలాంటి కార్యక్రమంతో కొత్త పాత కార్యకర్తలను కలుపుకొని పోవాలాని, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేలా స్థానిక నాయకులు చొరవ చూపాలని సూచించారు.

ఇప్పటి వరకు కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ అందించామని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనంతో కార్యకర్తల మనోభావాలు తెలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ ఆజీజ్ ఖాన్, కూడా మాజీ చైర్మన్ యాదవ రెడ్డి, కార్పొరేటర్ విజయ లక్ష్మీ సురేందర్, సదాంత్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version