Medak | అంకుటిత దీక్షతో పని చేయడం వ‌ల్లే అవార్డులు: MLA పద్మా దేవేందర్ రెడ్డి

Medak విధాత, మెదక్ బ్యూరో: గ్రామ స్థాయి నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు అకుంఠిత దీక్షతో పనిచేయడం వల్లే నేడు గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక మాయా గార్డెన్ లో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యకమంలో ఆమె మాట్లాడారు. పల్లెలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్రముఖ్యమంత్రి మదిలో మెదిలిన ఆలోచన మానస పుత్రికలే ఈ కార్య‌క్రమాలకు […]

  • Publish Date - June 16, 2023 / 12:44 AM IST

Medak

విధాత, మెదక్ బ్యూరో: గ్రామ స్థాయి నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు అకుంఠిత దీక్షతో పనిచేయడం వల్లే నేడు గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక మాయా గార్డెన్ లో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యకమంలో ఆమె మాట్లాడారు.

పల్లెలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్రముఖ్యమంత్రి మదిలో మెదిలిన ఆలోచన మానస పుత్రికలే ఈ కార్య‌క్రమాలకు నాంది అని అన్నారు. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో ప్రజాప్రతిధులు, అధికారులు తపనతో పనిచేయడం వల్లే పల్లెలలో గుణాత్మక మార్పులు వచ్చాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వన్నెలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాక్టర్, ట్రాలీ, డోజర్ వంటివి అందించి పరిశుభ్రతకు పెద్ద పెట్ట వేశామన్నారు.

గాంధీజీ కళలు గన్న గ్రామా స్వరాజ్య దిశగా నేడు పల్లెలు స్వయం సమృద్ధి సాధించాయని, పట్టణాలకు వలసలు వెళ్లిన వారు తిరిగి పల్లెల వైపు చూస్తున్నారని అన్నారు. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించుటకు పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టామని అన్నారు. అదేవిధంగా పట్టణాలలో పరిశుభ్రతకు సిపాయి కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకోవడంతో పాటు ,చెత్త సేకరణ వాహనాలను సమకూర్చామని అన్నారు.

ముఖ్యమంత్రి మేధావులతో చర్చించి పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. నేడు పల్లెలలో జవాబుదారీతనం, పోటీతత్వం పెరిగి ఒక గ్రామాన్ని మించి మరో గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుటలో కృషిచేస్తున్నారని అన్నారు. నేడు ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్భయంగా పల్లెల బాట పడుతున్నారని, ప్రజల నుండి ఏమైనా ఫిర్యాదులొచ్చినా స్వీకరించి పరిష్కరిస్తున్నారని అన్నారు. నేడు పల్లెలు దేశానికి దిక్సూచిగా, రోల్ మాడల్ గా నిలుస్తున్నాయని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని , ఇదే స్పూర్తితో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయని అన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను సరళం చేస్తూ బాధ్యతలు ఫిక్స్ చేసినందున నేడు ప్రజాప్రతినిధులు, అధికారులలో జవాబుదారీ తనం పెరిగి సమన్వయంతో చక్కటి ప్రణాళికతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల గ్రామాలలో ఆహ్లాద వాతావరణం నెలకొందని అన్నారు.

అనంతరం ఉత్తమ సేవలందించిన ప్రజాప్రతినిధువులు, అధికారులు, సిబ్బందికి, సిపాయి కార్మికులను జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో అతిధులు సన్మానించారు. అంతకుముందు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రచురించిన కరపత్రాలను ముఖ్య అతిధులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ,జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, మునిసిపల్ చైర్మన్లు చంద్ర పాల్, రవీందర్ గౌడ్, జితేందర్ గౌడ్, మునిసిపల్ కమీషనర్లు జానకిరామ్ సాగర్, మోహన్, వెనుకా గోపాల్, ఉమాదేవి, జెడ్పి సీఈఓ శైలేష్, , డిఆర్ డిఓ శ్రీనివాస్, డిపిఓ సాయిబాబ, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.’

Latest News