Medak | బీసీల‌కు మంత్రిత్వ‌శాఖ ఏర్పాటు చేయాలి: కృష్ణ‌య్య‌

Medak మెదక్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి విధాత, మెదక్ బ్యూరో: చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, అర్.కృష్ణయ్య గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం జీ.కే.ఆర్ గార్డెన్స్ […]

  • Publish Date - July 18, 2023 / 04:04 PM IST

Medak

  • మెదక్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ప్రారంభం..
  • పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, అర్.కృష్ణయ్య గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం జీ.కే.ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని నిజాం నిరంకుశత్వాని వ్యతిరేకంగా బాపూజీ పోరాటం చేశారని గుర్తు చేశారు.

అదేవిధంగా తొలి, మలిదశ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్న మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. రాబోయే తరాల వారికి సైతం ఆదర్శప్రాయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 1975 సంవత్సరం విద్యార్థి దశ నుంచి నాకు లక్ష్మణ్ బాపూజీతో తనకు సంబంధం ఉందని తెలిపారు.

ఆయనలో ఉన్న ఉత్తమ లక్షణాలు ధైర్యం, సాహసం, అంకితభావం, నిబద్ధత, నిజాయితీ ముక్కుసూటి తత్వం చూశానని తెలిపారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం దేశం లోని బీసీలందరూ ఉద్యమించాలని తెలిపారు. అలాగే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. అయన ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కేట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాములు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బొద్దుల సంతోష్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ బీమారి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు బొద్దుల కృష్ణ, యువజన డివిజన్ అధ్యక్షుడు గుండు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Latest News