Site icon vidhaatha

Dolphin | యమునా నదిలో వలలో పడ్డ డాల్ఫిన్‌.. వండుకు తిన్న జాలర్లు! అరెస్ట్‌

Dolphin

విధాత‌: య‌మునా న‌దిలో వ‌ల‌కు చిక్కిన డాల్ఫిన్‌ను వండుకుతిన్న న‌లుగురు జాల‌ర్ల‌పై కేసు న‌మోదైంది. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు పోలీసులు ఒక‌రి అరెస్టు చేశారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఇటీవ‌ల వ‌రుస‌గా కురిసిన భారీ వ‌ర్షాల‌కు యమునా న‌ది ఉప్పొంగిన సంగ‌తి తెలిసిందే.

ఆ న‌దిలో అనేక జంతుజాలాలు కొట్టుకొచ్చాయి. అలాగే న‌దిలో వ‌చ్చిన ఒక టాల్ఫిన్ జాల‌ర్ల వ‌లకు చిక్కింది. దానిని ముగ్గురు భుజాల‌పై ఎత్తుకొని వెళ్తున్నఫొటో ఆదివారం సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న‌పై సోమవారం చైల్ ఫారెస్ట్ రేంజర్ రవీంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని నసీర్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు జూలై 22న ఉదయం యమునా నదిలో చేపల వేటకు వెళుతుండగా డాల్ఫిన్ వలలో చిక్కుకుందని పిప్రి ఎస్‌హెచ్‌వో శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. దానిని వండుకొని తిన్నార‌ని పేర్కొన్నారు.

Exit mobile version