ఫిబ్రవరి ఒకటి నుంచి మినీ మేడారం జాతర

జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ విధాత, వరంగల్: వచ్చే నెల ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం మినీ మేడారం జాతర నిర్వహణపై జిల్లా పరిషత్ […]

  • Publish Date - January 5, 2023 / 03:01 PM IST
  • జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

విధాత, వరంగల్: వచ్చే నెల ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం మినీ మేడారం జాతర నిర్వహణపై జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీవో పీవో అంకిత్‌లతో కలిసి సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మినీ మేడారం జాతరకు నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని, ఈసారి జరిగే జాతరకు రూ.2 కోట్ల 8లక్షలతో కలెక్టర్ ప్రతిపాదించిన బడ్జెట్ మంజూరు చేస్తామని అన్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. జాతర అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య మంత్రికి వివరించారు. మంచినీటి సదుపాయం, ఎలక్ట్రిసిటీ, మరుగుదొడ్లు ఏర్పాటు, పరిసర ప్రాంతాలు‌, గద్దెల వద్ద శుచి శుభ్రత పాటించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ధ్వంసమైన రోడ్ల పనులు చేపట్టి నిర్లక్ష్యం కాకుండా చూడాలని సూచించారు. కొండాయి, ఐలాపూర్ ప్రాంతాల్లో చేపట్టే పనులకు దేవదాయశాఖ నిధులు సమకూరుస్తామని అన్నారు. మినీ మేడారం జాతర విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

అనంతరం జీవో 58 ప్రకారం పేదలకు ఇండ్లపట్టాలను మంత్రి అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై వి గణేష్,, జడ్పీ వైస్ చైర్మన్ బడె నాగ జ్యోతి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, డిఆర్ఓ కే రమాదేవి, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, జిల్లా వైద్యాధికారి అప్పయ్య, మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు సిద్దబోయిన జగ్గారావు, కిరణ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.