Telangana Budget | తెలంగాణ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజున మధ్యాహ్నం 12:10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు.
గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఏసీ(శాసనసభ వ్యవహారాల సంఘం) సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి..? గవర్నర్ ప్రసంగం, బడ్జెట్, పద్దులపై చర్చ ఏ రోజున చేపట్టాలనే అంశాలపై బీఏసీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. బడ్జెట్ ప్రసంగం, ప్రతులు, పద్దులపై చర్చ, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తదితర అంశాలపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.