నిర్మల్‌లో బీజేపీ బోణి.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఓటమి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తొలి గెలుపును నిర్మల్ నియోజకవర్గంలో దక్కించుకుంది

  • Publish Date - December 3, 2023 / 09:02 AM IST

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తొలి గెలుపును నిర్మల్ నియోజకవర్గంలో దక్కించుకుంది. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై గెలుపొందారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మహేశ్వర్‌రెడ్డి శాసన సభ్యుడిగా ఎన్నికవ్వడం గమనార్హం. బీజేపీ సీనీయర్లు బండి, ఈటల, అర్వింద్‌, రఘునందన్‌రావు వంటి వారు ఓడిన ఎన్నికల్లో మహేశ్వర్‌రెడ్డి విజయం ఆ పార్టీకి ఊరటనిచ్చింది