Jagadish Reddy |
- తెలంగాణలో పవర్ కట్ ఉండదు
- విపత్తు సమయంలోనూ విద్యుత్తు
- లో-ఓల్టేజి సమస్యకు సత్వర పరిష్కారం
- మెయింటెన్స్‌కు నిధులు పుష్కలం
- ఎల్‌సీ తీసుకున్న వారే ప్రమాదలకు బాద్యులు
- శాసనమండలిలో మంత్రి జగదీశ్ రెడ్డి
విధాత: హైదరాబాద్ పాత బస్తీలో 1,404.58 కోట్ల వ్యయంతో టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ఎస్‌డీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్తు నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
పై 1,404.58 కోట్లలో ట్రాన్స్‌మిషన్‌కు గాను ట్రాన్స్‌కో నుండి రూ.957.29 కోట్లు వెచ్చించగా టీఎస్ఎస్‌డీసీఎల్ రూ.447.29 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి సభకు తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్ల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి విద్యుత్తు సరఫరాలను క్రమబద్ధీకరించినట్లుగా మంత్రి పేర్కొన్నారు.