Site icon vidhaatha

Minister Konda Surekha | మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం.. ఇంటి నుంచే కార్యక్రమాల పర్యవేక్షణ

విధాత‌: అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి, తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఐదు రోజులగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు.


ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ, రోజువారి కార్యక్రమాలను మంత్రిగారు పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కోలుకొని, పునరుత్తేజంతో మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రిగారు పాల్గొంటారు.

Exit mobile version