విధాత : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృ వియోగం కల్గింది. ప్రశాంత్‌రెడ్డి తల్లి వేముల మంజులమ్మ అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలు స్వగ్రామం వెల్పూరులో శుక్రవారం నిర్వహించనున్నారు. మంజులమ్మ మృతి పట్ల సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.