Site icon vidhaatha

Srinivas Goud Warn BJP | కేసీఆర్‌ కుటుంబాన్ని ఇబ్బందిపెడితే రాష్ట్రం అగ్నిగుండమే: శ్రీనివాస్‌ గౌడ్‌

విధాత‌: మహిళా దినోత్సవం రోజు ఎమ్మెల్సీ కవిత (MLC Kavith) కు ఈడీ నోటీసులు జారీచేయడం మహిళలను గౌరవించకపోవడమేనని, కేసీఆర్‌ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (Srinivas Goud ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

కేసీఆర్‌ వెంటే తెలంగాణ (Telangana) ప్రజలున్నారని, రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితను అడ్డం పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ, ఈడీలను కేంద్రం భ్రష్టుపట్టిస్తోందని, బ్యాంక్‌లకు ఎగనామం పెట్టి దేశం దాటిన వాళ్లకు కేంద్రం అండగా నిలుస్తూ, మాటవినని వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ రాష్ట్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసిన కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన అదానీ గురించి ఎందుకు నోరు మెదపదని మంత్రి నిలదీశారు.

Read More>>

ED Notice To Kavitha । కవితను విచారణకు పిలిచారా? అరెస్టుకా?

Exit mobile version