Miryalaguda | అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలివ్వాలి: జూలకంటి

Miryalaguda విధాత: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పోడు రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వకపోతే సిపిఎం మరో పోరాటం చేపడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాల అటవీ భూములకు సంబంధించి 4.25 లక్షల మందికి హక్కు పత్రాలు ఇస్తామని కెసిఆర్ చెప్పారన్నారు. ప్రస్తుతం లక్షన్నర మందికి 4.6లక్షల ఎకరాల్లో మాత్రమే పంపిణీ చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3 […]

  • Publish Date - June 30, 2023 / 11:48 PM IST

Miryalaguda

విధాత: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పోడు రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వకపోతే సిపిఎం మరో పోరాటం చేపడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాల అటవీ భూములకు సంబంధించి 4.25 లక్షల మందికి హక్కు పత్రాలు ఇస్తామని కెసిఆర్ చెప్పారన్నారు.

ప్రస్తుతం లక్షన్నర మందికి 4.6లక్షల ఎకరాల్లో మాత్రమే పంపిణీ చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3 లక్షల పోడు పట్టాలు పంపిణీ చేశారన్నారు. లక్షన్నర మంది గిరిజనేతరులు ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు దక్కడం లేదన్నారు.

ప్రభుత్వం చెప్పిన దానిలో 50% కూడా పోడు పట్టాలు ఇవ్వడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో 2,928 మందికి 5578 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 84 మందికి 84 ఎకరాలు, భువనగిరి యాదాద్రి జిల్లాలో 2005 మందికి 213 ఎకరాలు పంపిణీ చేస్తున్నారన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకే విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం, ఇతర పార్టీల పొత్తుల కోసం కమ్యూనిస్టు పార్టీలు వెంపర్లాడడం లేదన్నారు. బిజెపి వ్యతిరేక విధానంతో ఉన్న పార్టీలతోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు.

Latest News