Indiramma Indlu | మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. పేదవాడికి కూడు..గూడు కావాలంటే కాంగ్రెస్ పార్టీ తో సాధ్యపడుతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుండ్రెడ్డి బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు వంగాల కృష్ణారెడ్డి, తిప్పన రామ్ రెడ్డి, తిప్పన రవీందర్ రెడ్డి, జెట్టి చంద్రయ్య, మంద సైదులు, హౌసింగ్ ఏఈ యమునా, గ్రామ కార్యదర్శి రేవతి, పోలే రవి, మట్టయ్య, కూరాకుల నాగరాజు,సత్యం, రామంజి వినయ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.