Site icon vidhaatha

‘బలగం’ మొగిలయ్యకు.. ఎమ్మెల్యే పెద్ది ఆపన్నహస్తం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ‘బలగం’ సినిమాలో పాట పాడి ఆకట్టుకున్న బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి తగిన చికిత్స అందించేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్యలు చేపట్టారు.

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చికిత్స పూర్తయ్యేవరకు వైద్య ఖర్చులకు ఎన్ని లక్షలైన సరే LOC చెక్కును అందజేస్తామని హామీ ఇచ్చారు.

LOC ప్రొసీజర్ వెంటనే ప్రారంభించి ఒకటి,రెండు రోజుల్లో వైద్యం కొరకు మొగిలయ్యను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను స్థానిక నాయకులు రైతు సమన్వయ సమితి బాధ్యులు తోకల నరసింహారెడ్డికి అప్పగించారు.

మొగిలయ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారు త్వరగా తిరిగి కోలుకుని తన కళ ద్వారా తెలంగాణ సంస్కృతికి జీవంపోసి అనేక మందిని అలరించాలని ఈ సందర్భంగా కోరారు.

Exit mobile version