విధాత: కవిత జైలుకు వెళ్లాల్సి వస్తే అది తాను చేసిన అవినీతి పనుల వల్లనే వెళ్తుందని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజల కోసం జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
తప్పులు బయటపడుతాయనే ముందే బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల సానుభూతి కోసం కేసీఆర్ కుటుంబం ప్రయత్నిస్తున్నదని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ అంటే భయమెందుకు? అని ప్రశ్నించారు.