గల్ప్ కార్మికుడిని స్వదేశానికి తీసుకువచ్చిన MLC శేరి సుభాష్ రెడ్డి

ఏజెంట్ మోసం.. ప‌ర్మిట్ వీసా లేకుండా దుబాయ్ ప‌య‌నం అనారోగ్యంతో అవ‌స్థ‌లు.. ఎట్ట‌కేల‌కు స్వగ్రామం చేరుకున్న శ్యామయ్య విధాత, మెదక్ బ్యూరో: హావేలి ఘనపూర్ మండలం శాలిపేట్ గ్రామానికి చెందిన ఎల్ల శ్యామయ్య బతుకుదెరువు కోసం ఓ ఏజెంట్ మాయమాటలు నమ్మి వర్క్ పర్మిట్ వీసా లేకుండా నిర్మాణ రంగ కంపెనీలో పనిచేయడానికి దుబాయి వెళ్ళాడు. చేరిన స్వల్ప కాలానికే మానసిక, అనారోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలో ఎల్ల శామయ్య […]

  • Publish Date - January 27, 2023 / 02:12 PM IST

  • ఏజెంట్ మోసం.. ప‌ర్మిట్ వీసా లేకుండా దుబాయ్ ప‌య‌నం
  • అనారోగ్యంతో అవ‌స్థ‌లు..
  • ఎట్ట‌కేల‌కు స్వగ్రామం చేరుకున్న శ్యామయ్య

విధాత, మెదక్ బ్యూరో: హావేలి ఘనపూర్ మండలం శాలిపేట్ గ్రామానికి చెందిన ఎల్ల శ్యామయ్య బతుకుదెరువు కోసం ఓ ఏజెంట్ మాయమాటలు నమ్మి వర్క్ పర్మిట్ వీసా లేకుండా నిర్మాణ రంగ కంపెనీలో పనిచేయడానికి దుబాయి వెళ్ళాడు. చేరిన స్వల్ప కాలానికే మానసిక, అనారోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.

ఈ క్రమంలో ఎల్ల శామయ్య పాస్‌పోర్టు సైతం పోగొట్టుకొని కుటుంబీకులతో కాంటాక్ట్ కోల్పోయాడు. ఆచూకీ కోల్పోయిన ఎల్ల శామయ్యను కనుక్కునేందుకు బాధితుడి భార్య, బంధువులు చాలా మంది నాయకులను కలిశారు. వారు స్పందించక పోవడంతో చివరికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని కలుసుకొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ బాధితుడి వివరాలతో దుబాయిలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

భారత రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐ విభాగం నాయకులను సైతం ఎల్ల శామయ్య ఆచూకీ కనిపెట్టాల్సిందిగా కోరారు. ఎమ్మెల్సీ ప్రయత్నంతో ఎల్ల శామయ్య ఆచూకీ లభించింది. దుబాయి వెళ్లిన రెండు మూడు రోజులకే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్వదేశం వచ్చే ప్రయత్నం చేసి ఎయిర్ పోర్ట్ లోనే సృహ కోల్పోయి.. రషీద్ హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం ఎమ్మెల్సీ బాధితుడి కుటుంభ సభ్యులకు తెలిపారు. శామయ్యను ఇంకొక సహ ప్రయాణికుడి సహాయంతో స్వ‌దేశానికి స్వదేశానికి రప్పించారు.

స్వదేశానికి తిరిగి వచ్చిన ఎల్ల శ్యామయ్య తన కుటుంబంతో ఎమ్మెల్సీని కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి విన్నవించారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బతుకుతెరువు కోసం దొంగ ఏజెంట్ల మాటలను నమ్మి శాలిపేటకు చెందిన ఎల్ల శామయ్య మోసపోయాడు అని, ఆ ఏజెంట్ శామయ్యను తాత్కాలిక వర్కు పర్మిట్ పై పంపి కూలీ పనులలో ఉంచడం జరిగింది.

అనంతరం శ్యామయ్య తీవ్ర అస్వస్థత గురికాగా 29 రోజులపాటు ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందించేలా ఏర్పాటు చేశామని తెలిపారు. కోలుకున్న అనంతరం శాలిపేట శ్యామయ్యకు తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాను ఏర్పాటు చేయించి స్వదేశానికి వచ్చేలా చేశామ‌ని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. దుబాయ్ లో ఉన్న తన మిత్రుల ద్వారా విమాన టికెట్ తీయించి స్వదేశానికి తీసుకువచ్చామని తెలిపారు.

సుభాష్‌రెడ్డి బాధితుడు శ్యామయ్యతో మాట్లాడుతూ మంచో చెడు కుటుంబ సభ్యుల ముందట, రూపాయి తక్కువైనా సరే స్వదేశంలోనే బతకడం ఉత్తమమని సూచించారు. మోసం చేసిన ఏజెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని.. ఏజెంట్ నుండి రుసుము మొత్తాన్ని తిరిగి ఇప్పించేలా కృషి చేస్తామని శ్యామ‌య్య కుటుంబానికి హామీ ఇచ్చారు. అలాగే ఆర్థికంగా చితికిపోయిన శామయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Latest News