Mohan Bhagwat | భారత్‌.. హిందూ రాష్ట్రం: ఆరెస్సెస్‌ చీఫ్‌

<p>భారతీయులంతా హిందువులే ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ Mohan Bhagwat న్యూఢిల్లీ : భారత్‌ హిందూ రాష్ర్టమని, భారతీయులందరూ హిందువులేనని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. హిందూ అనేది భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. అందరి గురించి సంఘ్‌ ఆలోచించాలనేది ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. దైనిక్‌ తరుణ్‌ భారత్‌ పత్రికను నడిపే శ్రీ నరకేసరి ప్రకాశన్‌ లిమిటెడ్‌కు చెందిన నూతన భవనం మధుకర్‌ భవన్‌ను శుక్రవారం ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. ‘హిందూస్థాన్‌ హిందూ దేశం. […]</p>

Mohan Bhagwat న్యూఢిల్లీ : భారత్‌ హిందూ రాష్ర్టమని, భారతీయులందరూ హిందువులేనని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. హిందూ అనేది భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. అందరి గురించి సంఘ్‌ ఆలోచించాలనేది ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. దైనిక్‌ తరుణ్‌ భారత్‌ పత్రికను నడిపే శ్రీ నరకేసరి ప్రకాశన్‌ లిమిటెడ్‌కు చెందిన నూతన భవనం మధుకర్‌ భవన్‌ను శుక్రవారం ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు.

‘హిందూస్థాన్‌ హిందూ దేశం. ఇది నిజం. సైద్ధాంతికంగా భారతీయులందరూ హిందువులు. హిందువులు అంటే అందరు భారతీయులు. ఈ రోజు భారతదేశంలో ఉన్నవారందరూ హిందూ సంస్కృతికి, హిందూ వారసత్వానికి, హిందూ గడ్డకు సంబంధం కలిగి ఉన్నారు. దీనికి మించింది లేదు’ అని ఆయన చెప్పారు. ‘కొంతమంది దీనిని అర్థం చేసుకున్నారు.