Site icon vidhaatha

Monsoon | రైతులకు తీపి కబురు.. తెలంగాణను తాకిన రుతుపవనాలు

Monsoon

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు అందించింది. బుధవారం ఉదయం రుతుపవనాలు తెలంగాణను తాకాయి. వర్షాల కోసం రైతుల ఎదురుచూపుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ద్వీపకల్ప దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలలోని పలు ప్రాంతాలలో వానలు కురిసినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version