ఘ‌ట్‌కేస‌ర్ వీబీఐటీ కాలేజీలో దారుణం.. విద్యార్థినుల ఫోటోలు న్యూడ్‌గా మార్ఫింగ్

విధాత: మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలోని వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జ‌రిగింది. ఆ కాలేజీలో బీటెక్ చ‌దువుతున్న విద్యార్థినుల ఫోటోల‌ను కొంత మంది యువ‌కులు సేక‌రించారు. ఆ అమ్మాయిల ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ ఫోటోల‌ను అడ్డుగా పెట్టుకుని, వేధింపుల‌కు గురి చేస్తున్నారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత విద్యార్థినులు ఘ‌ట్‌కేస‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వీబీఐటీ కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. […]

  • Publish Date - January 5, 2023 / 10:35 AM IST

విధాత: మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలోని వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జ‌రిగింది. ఆ కాలేజీలో బీటెక్ చ‌దువుతున్న విద్యార్థినుల ఫోటోల‌ను కొంత మంది యువ‌కులు సేక‌రించారు. ఆ అమ్మాయిల ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.

అంత‌టితో ఆగ‌కుండా ఆ ఫోటోల‌ను అడ్డుగా పెట్టుకుని, వేధింపుల‌కు గురి చేస్తున్నారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత విద్యార్థినులు ఘ‌ట్‌కేస‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వీబీఐటీ కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

వాట్సాప్‌ గ్రూపుల్లో అమ్మాయులు డీపీగా పెట్టుకున్న ఫోటోలను సేకరించి వాటిని న్యూడ్ ఫోటోలుగా మారుస్తున్నారు. అనంతరం వాటిని వివిధ గ్రూపుల్లో షేర్ చేస్తూ.. విద్యార్థినులను వేధిస్తున్నారు.
ఇలా పలువురు అమ్మాయిలు కామాంధుల వేధింపులకు బలయ్యారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు కాలేజ్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాకేంతిక పరిజ్ఞానంతో విచారణ జరిపి.. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారినిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాలేజీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ‌కుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.