Site icon vidhaatha

Film Nagar | జీవితంపై విరక్తితో తల్లి ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు

Film Nagar |

విధాత: పేదరికం.. కుటుంబ కలహాల నేపధ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను అనాథలను చేసి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లో మహత్మాగాంధీ నగర్ బస్తీకి చెందిన నందిని(23) భర్త మంజునాథ్ జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించాడు.

దీంతో నందిని భిక్షాటన చేస్తూ పిల్లలు మణికంఠ(3), సాయి(1)లను పోషిస్తోంది. అయితే, అత్తింటి వారు పట్టించుకోకపోవడం, గొడవలు, ఆర్థిక ఇబ్బందులతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి పిల్లలను నిద్రపుచ్చి, వారి పక్కనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

Exit mobile version