MP Asad | ఢిల్లీలో.. ఎంపీ అసద్ ఇంటిపై దాడి

MP Asad | విధాత: న్యూఢిల్లీలో ఎంఐఎం ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ ఇంటిపై గుర్తు తెలియన దుండగులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇంటి కిటికి అద్దాలు పగిలి వుండటాన్ని గమనించిన ఎంపీ అసదుద్ధిన్ ఇంటిపై ఎవరో రాళ్ల దాడి చేశారంటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడి జరిగిందని అసద్ పేర్కోన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా అసద్ ఇంటిపై నాలుగు పర్యాయాలు దాడులు జరిగాయి. యూపీ […]

  • Publish Date - August 14, 2023 / 02:47 PM IST

MP Asad |

విధాత: న్యూఢిల్లీలో ఎంఐఎం ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ ఇంటిపై గుర్తు తెలియన దుండగులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇంటి కిటికి అద్దాలు పగిలి వుండటాన్ని గమనించిన ఎంపీ అసదుద్ధిన్ ఇంటిపై ఎవరో రాళ్ల దాడి చేశారంటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడి జరిగిందని అసద్ పేర్కోన్నారు.

పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా అసద్ ఇంటిపై నాలుగు పర్యాయాలు దాడులు జరిగాయి. యూపీ ఎన్నికల సందర్భంగా ఆయనపై కాల్పులు కూడా జరిగాయి.

ఈ ఘటనపై ఎంపీ అసద్ మాట్లాడుతూ దేశంలో ఓ వైపు ముస్లింల ఇళ్లపైకి బుల్ డోజర్లు, ఇంకోవైపు ఎంపీల ఇంటిపైకి రాళ్ల దాడులు ఎంతవరకు సమంజసమంటు ప్రశ్నించారు.

ఇదే దాడి బీజేపీ నేత ఇంటిపై జరిగితే ఇప్పటికే పెద్ద గొడవ జరిగేదన్నారు. ఈ తరహా దాడులు దేశానికి మంచివి కావన్నారు.