Site icon vidhaatha

Murali Mohan | మళ్లీ సినిమాలు మొదలెడతా.. కానీ ఈసారి పరిమితంగానే!

Murali Mohan |

విధాత‌: సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా, సినీ నిర్మాతగా, వ్యాపార వేత్తగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొంది.. కెరియర్‌ను సక్సెస్ చేసుకున్న శ్రీమంతుడు మురళీ మెహన్. సినీ మాయా లోకంలో హీరోగా వెలిగి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించి, వ్యక్తిత్వంలోనూ హీరో అనిపించుకున్నాడు మురళీ మోహన్. అటు సినిమా రంగం, ఇటు వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని రాజకీయాల్లోనూ ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తి ఆయన.

ఆయన తన సినీ ప్రయాణం మొదలై 50 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా ఇటీవల ఓ మీడియాలో తన అంతరంగాన్ని పంచుకున్నారు. తన సినీ జీవితం, వ్యాపారం, రాజకీయం ఇలా అన్ని రంగాలలోనూ తన అనుభవాలను మీడియా ముఖంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

హీరోగా మురళీ మోహన్ చేసినవి 25 సినిమాలు. అయితే అప్పటి కాలానికి తగ్గట్టుగా, కథలన్నీ తక్కువ బడ్జెట్‌వే కావడంతో సక్సెస్ ఎలా అందుకున్నారో, పెద్ద తారాగణంతో తెరకెక్కించిన కొన్ని చిత్రాల కారణంగా ఆర్థిక దెబ్బలు తిన్న సందర్భాలూ ఉన్నాయి. ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు ‘లేదు.. నేను అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా బిజీ అయిపోయాను. అదే సమయంలో రాజకీయాల్లోనూ ఉండటంతో వీలు చిక్కలేదు. అలా సినిమా తెరకు దూరం కావలసి వచ్చిందే కానీ.. నష్టం వచ్చిందని మాత్రం నేను సినిమాలకు దూరం కాలేదు..’ అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. వరుసగా ఎన్ని సినిమాలు సక్సెస్ చేసుకుంటూ హిట్ కొట్టినా ఏదో సినిమా బోల్తా కొట్టిందంటే అప్పటి వరకూ వచ్చిందంతా వదులుకున్నట్టే.. అదే వ్యాపారంలో అయితే రూపాయికి రూపాయి కలుస్తూనే ఉంటుంది. అదే లాజిక్‌తో మళ్ళీ సినిమాలవైపు రాలేదన్నారు.

అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా సినిమా రంగంలో చిత్ర నిర్మాణం చేపట్టాలని ఉందని.. త్వరలో వర్క్ మొదలవ్వచ్చని తెలిపారు. ‘సినీ రంగంలో ఉన్న అనుభవంతో దర్శకత్వం చేయచ్చు కదా’ అని చాలా మంది సలహా ఇస్తుంటారు కానీ నాకు దర్శకత్వం మీద అంతగా ఆలోచన లేదన్నారు మురళీ మోహన్.

మురళీ మోహన్ సినీ పాత్రలన్నీ అప్పటి రోజుల్లో ప్రత్యేకంగా ఉండేవి. మంచి నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లోనే ఆయన నటించాడు. వ్యాపారం.. రాజకీయాల దృష్ట్యా కాస్త విరామం వచ్చినా.. ఈ మధ్యకాలంలో వచ్చిన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఓ అతిథి పాత్రలో కనిపించాడు.

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినీ రంగంలోకి రావడమంటే ప్రేక్షకుల్లో మరిన్ని మంచి పాత్రలు చేసి మెప్పిస్తాడనే ఆలోచనైతే ఉంటుంది. ప్రస్తుతం శుభలేఖ సుధాకర్ ఎలా బిజీ అయ్యారో తెలిసిందే. ఆయనలానే ముందు చిన్న చిన్న పాత్రలు చేసి.. ఆ తర్వాత పరిమిత బడ్జెట్‌లో సినిమాలు నిర్మిస్తానని మురళీ మోహన్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Exit mobile version