Nalgonda | లంచం డిమాండ్ వివాదంలో నిడమనూరు SI

Nalgonda వాట్సప్ చాటింగ్‌లతో ఎస్పీకి ఫిర్యాదు అదంతా ఫేక్ అని కొట్టి పారేసిన ఎస్ఐ విధాత: నల్గొండ జిల్లా నిడమనూరు ఎస్సై శోభన్ బాబు ఓ కేసులో రెండు లక్షల లంచం డిమాండ్ చేశారని వాట్సప్ చాటింగ్ ఆధారాలతో బాధితులు జిల్లా ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగు చూసింది. నిడమనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారమ్మ గూడెంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో మునగాల పద్మ ఫిర్యాదు మేరకు దుబ్బాకుల రామిరెడ్డి, కుశలవ […]

  • Publish Date - May 21, 2023 / 02:31 PM IST

Nalgonda

  • వాట్సప్ చాటింగ్‌లతో ఎస్పీకి ఫిర్యాదు
  • అదంతా ఫేక్ అని కొట్టి పారేసిన ఎస్ఐ

విధాత: నల్గొండ జిల్లా నిడమనూరు ఎస్సై శోభన్ బాబు ఓ కేసులో రెండు లక్షల లంచం డిమాండ్ చేశారని వాట్సప్ చాటింగ్ ఆధారాలతో బాధితులు జిల్లా ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగు చూసింది.

నిడమనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారమ్మ గూడెంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో మునగాల పద్మ ఫిర్యాదు మేరకు దుబ్బాకుల రామిరెడ్డి, కుశలవ రెడ్డి, వేముల సిద్ధార్థ రెడ్డి లపై నిడమనూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుశలవ రెడ్డికి, సిద్ధార్థ రెడ్డిలకు సంబంధం లేదని వారి పేర్లు తొలగించాలంటూ రామిరెడ్డి కొడుకు అమెరికా ఎన్నారై పురుషోత్తం రెడ్డి అలియాస్ రిక్కి రెడ్డి నిడమనూరు ఎస్సై శోభన్ బాబుకు విన్నవించారు.

ఇందుకోసం రిక్కిరెడ్డికి, ఎస్ఐకి జరిగిన వాట్సాప్ చాటింగ్ లో ఎస్సై వారి పేర్ల తొలగింపుకు రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని 10వేలు లేదా 20 వేలు ఇస్తానని రిక్కీ రెడ్డి వాట్సాప్ చాట్ లో పేర్కొనగా, ముష్టి వేస్తున్నావా అంటూ చాటింగ్ లో పేర్కొన్న ఎస్ఐ ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.

అడిగిన డబ్బులు ఇవ్వనందునే ఈ కేసులో కుశలవ రెడ్డి, సిద్ధారెడ్డి లను ఇరికించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం పై రిక్కిరెడ్డికి, ఎస్ఐకి మధ్య జరిగిన చాటింగ్ ఆధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు

దీనిపై శోభన్ బాబు స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను మీడియా సమావేశంలో కొట్టి పారేశారు. ఫేక్ వాట్సాప్ చాట్ సృష్టించి రిక్కిరెడ్డి నా డిపి తో రెండు ఫోన్ల ద్వారా చాటింగ్ చేసి, స్క్రీన్ షాట్లను తీసి తనపై దుష్ప్రచారం చేశారని ఎస్సై ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేసిన రిక్కిరెడ్డిపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.

Latest News