ఉమ్మడి నల్గొండ: ఊరురా.. కనుల పండువగా రాములోరి కళ్యాణం

యాదాద్రి, రామగిరిలలో ఘనంగా కల్యాణ వేడుకలు విధాత: శ్రీరామనవమి (Rama Navami) పర్వదినం పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర కల్యాణోత్సవాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అభిజిత్ లగ్నంలో శాస్త్ర యుక్తంగా వైభవంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం కొండపైన శివాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వేడుకను కనుల పండగగా నిర్వహించారు. ఈవో గీత, ఆలయ ధర్మకర్త బి. నరసింహమూర్తి, అర్చక బృందం, భక్తజనం స్వామి వారి కల్యాణోత్సవంలో […]

  • Publish Date - March 30, 2023 / 10:24 AM IST
  • యాదాద్రి, రామగిరిలలో ఘనంగా కల్యాణ వేడుకలు

విధాత: శ్రీరామనవమి (Rama Navami) పర్వదినం పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర కల్యాణోత్సవాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అభిజిత్ లగ్నంలో శాస్త్ర యుక్తంగా వైభవంగా నిర్వహించారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం కొండపైన శివాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వేడుకను కనుల పండగగా నిర్వహించారు. ఈవో గీత, ఆలయ ధర్మకర్త బి. నరసింహమూర్తి, అర్చక బృందం, భక్తజనం స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్గొండ రామగిరి రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని వేలాది మంది భక్తజన సమక్షంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల జయ జయ ద్వానాల మధ్య నేత్రపర్వంగా నిర్వహించారు.

స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దంపతులు, ఆలయ చైర్మన్ చకిలం వేణుగోపాలరావు, సంధ్యారాణి దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

యాదగిరి గుట్ట సమీపంలోని రాయగిరి సీతారామచంద్రస్వామి ఆలయం, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, సుంకిశాల, మిర్యాలగూడ, పీఏ పల్లి, శాలిగౌరారం రామాలయాల్లో, సూర్యాపేట, ఎల్లపల్లి, దేవరకొండ తదితర ప్రముఖ రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఎమ్మెల్యేలు ఆర్. రవీంద్ర కుమార్, ఎన్. భాస్కరరావు, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, తదితరులు తమ ప్రాంతాల్లోనే రామాలయాల్లో జరిగిన కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.