చంద్రబాబుకు అస్వస్థత

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమంత్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు

విధాత : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమంత్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు బాబు అస్వస్థతపై జైలు ప్రభుత్వ వైద్యులకు సమాచారమందించారు. వైద్యులు జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఎండ వేడిమి కారణంగా స్కిన్ అలర్జీకి, డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు.