లేడీ సూపర్‌స్టార్ నయనతార తాజాగా తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం రూమర్లకు తెరలేపింది. నెట్‌లో వైరల్ అవుతున్న రెడిట్ పోస్ట్ ప్రకారం నయన్, తన భర్తను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది.ఈ మధ్య తమిళసైట్లలో చెలరేగుతున్న రూమర్ల ప్రకారం దంపతులిరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దాని ఫలితమే ఈ అన్ ఫాలో దుమారం. ఇదిలా ఉండగానే నయనతార తన ఇన్‌స్టాలో ఓ నిగూఢమైన పోస్ట్ పెట్టింది. కంటినిండా కన్నీళ్లతో కూడా నాకిది దక్కింది అనుకుంటూ శాశ్వతంగా వెళ్లిపోయింది అని దానర్థం. మరి ఏంటి ఈ పోస్ట్ రహస్యంమనేది ఇంకా మనకు తెలియదు.
జూన్ 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట అంతకుముందు ఏడేళ్లు ప్రేమాయణం నడిపారు. 2015లో విఘ్నేశ్ దర్శకత్వంలో నటించిన నానుమ్ రౌడీ దా అనే చిత్రంతో వీరి ప్రేమకు బీజం పడింది. అక్టోబర్ 2022లో సరోగసీ ద్వారా ఇద్దరు బిడ్డలను కన్నట్లు ప్రకటించారు. అంతకుముందు నయనతార, నటుడు శింబుతో గాఢంగా ప్రేమలో పడిం ది. చాలాకాలం పాటు వీరి ప్రేమకథ తమిళరంగాన్ని ఓ ఊపు ఊపింది. వీరువురు కలిసి నటించిన ఓ చిత్రపు ముద్దు స్టిల్ ఇప్పటికీ సంచలనమే. అయితే చిన్నపాటి సైకోగా పేరు తెచ్చుకున్న శింబుతో గొడవలు ముదిరి, తెగేదాకా వెళ్లింది. కొన్నాళ్లు కామ్‌గా ఉన్న నయన్ మళ్లీ ఈసారి నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవాతో రిలేషన్ మొదలుపెట్టింది. ప్రభుదేవాకు అప్పటికే పెళ్లి కాగా, నయన్ దెబ్బతో మొదటి భార్యకు విడాకుల దాకా వెళ్లిన ప్రభుదేవా, భార్య మొండిపట్టుతో నయన్‌కు దూరం కాక తప్పింది కాదు. ప్రస్తుతం నయన్ దంపతుల మధ్య విబేధాలకు కారణమేమిటనేది అంతుపట్టని రహస్యం. వారు బయటపెట్టేదాకా ఈ రూమర్లు చెలరేగుతూనేఉంటాయి.