Site icon vidhaatha

UK | రోడ్డు మీ అయ్య జాగీరా.. కార్ తీయ్‌!

UK

విధాత‌: సాధార‌ణంగా ఎవ‌రైనా కారు రోడ్డుపై అడ్డ‌గోలుగా నిలిపితే.. రోడ్డు ఏమైనా నీ అయ్య జాగీరా? అని నిల‌దీస్తాం. అవ‌త‌లి వ్య‌క్తి ఏమైనా మాట్లాడితే తిడ‌తాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే లొల్లి పెట్టుకుంటాం. అవ‌సర‌మైతే కొట్లాట‌కు దిగుతాం. మ‌రింత తీవ్ర‌మైతే పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్ల‌డానికి కూడా వెనుకాడం. ఇది మ‌న ద‌గ్గ‌ర నిత్యం జరిగే వ్య‌వ‌హారం.

అయితే, బ్రిట‌న్‌లో ఓ వ్య‌క్తి కూడా ఇలాగే కారు రోడ్డుపై పార్క్ చేసిన వెళ్లిపోయాడు. ఆ కారు ఇతరుల‌ రాక‌పోక‌లు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఓ వ్య‌క్తి కారు య‌జ‌మానిపై వినూత్నంగా స్పందించాడు. “ద‌య‌చేసి ఇక్క‌డి నుంచి మీ కారు తీసివేయండి. ధ‌న్య‌వాదాలు” అని రాసిన లెట‌ర్‌ను కారు అద్దంపై అతికించి వెళ్లాడు. దీనికి కారు య‌జ‌మాని గ‌ట్టిగా బ‌దులిచ్చాడు.

Follow me for episode 3 of this amazing story
by u/buenocarallobueno in CasualUK

“నేను ఎందుకు కారు తీయాలి. ఇది నేను నివ‌సించే ర‌హ‌దారి. దీనికి నేను ప‌న్ను కడుతున్నాను. బీమా కూడా చేయించాను. అస‌లు ఎవ‌రు నీవు? క‌నీసం నీ నంబ‌ర్ చెప్ప‌?” అని మ‌రో లేఖ‌ను దాని కింద‌నే అద్దానికి అతికించాడు. ఈ రెండు లేఖ‌లు చూసిన నెటిజ‌న్లు ఫొటో తీసి సోష‌ల్‌మీడియాలో పెట్ట‌గా వైర‌ల్‌గా మారింది. కారు పార్కింగ్ విష‌యంలో త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

Exit mobile version