యూదుల ప్రార్థ‌నామందిరంలో బ‌య‌ట‌ప‌డిన సొరంగం.. న్యూయార్క్‌లో ర‌భ‌స‌

ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌సిద్ధి చెందిన.. అమెరికాలో కీల‌క న‌గ‌రం న్యూయార్క్‌లో ఒక ర‌హ‌స్య సొరంగం బ‌య‌ట‌ప‌డింది.

  • Publish Date - January 10, 2024 / 09:33 AM IST

ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌సిద్ధి చెందిన.. అమెరికాలో కీల‌క న‌గ‌రం న్యూయార్క్‌(New York) లో ఒక ర‌హ‌స్య సొరంగం బ‌య‌ట‌ప‌డింది. అది యూదుల ప్రార్థ‌నా మందిరం(Synagogue) లో బ‌య‌ట‌ప‌డ‌డం,, అందులో అనుమానాస్ప‌ద వ‌స్తువులు ఉండ‌టంతో ఇక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒకవైపు అందులోకి దూసుకెళ్ల‌డానికి నిర‌స‌న‌కారులు ఒక‌వైపు.. వారిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న యూదులు మ‌రోవైపు మోహ‌రించ‌డంతో తోపులాట‌లు చోటు చేసుకున్నాయి.


ఆ సొరంగానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ముఖ్యంలో అందులో ఉన్న బేబీ రాక‌ర్‌ (చిన్న పిల్ల‌ల వాహ‌నం)అంద‌రినీ విస్మ‌య‌ప‌రుస్తోంది. అక్క‌డ ఏమైనా బ‌లిదానం జ‌రిగిందా అని ఎక్స్‌లో ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఆ ప్రార్థ‌నా మందిరానికి చెందిన 12 మంది హ‌సిడిక్ యూదులను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. భ‌ద్ర‌తా సిబ్బంది ఈ సొరంగాన్ని పూడ్చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. నిర‌స‌నకారులు వారిని అడ్డుకున్నారు.


అందులోకి వెళ్లి పూర్తి స్థాయి ద‌ర్యాప్తు చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. కొంత‌మంది లోప‌ల‌కు దూసుకువెళ్లి లోప‌ల ఉన్న ఫ‌ర్నిచ‌ర్‌ను, వ‌స్తువుల‌ను చింద‌ర‌వంద‌ర చేశారు. దీంతో కొంత మంది నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక వివ‌ర‌ణ త‌ర‌హా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ సొరంగాన్ని కొన్నేళ్ల క్రిత‌మే త‌వ్విన‌ట్లు సమాచారం ఉంద‌ని.. అయితే దానికి ఎటువంటి అనుమ‌తీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక అధికారి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


యూదు ప్రార్థ‌నా మందిరం వ‌ద్ద జరిగిన ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని… అక్క‌డ ఆందోళ‌న‌కు దిగిన వారు తీవ్ర‌వాద భావాలున్న విద్యార్థుల‌ని అభివ‌ర్ణించారు. ఈ ర‌హ‌స్య సొరంగంపై త‌మ‌కు గ‌త నెల స‌మాచారం అందింద‌ని.. అయితే అక్క‌డ త‌మ ప‌రిశీల‌న‌లో అంతా స‌వ్యంగా ఉన్న‌ట్లు గుర్తించామ‌ని స్థానిక అగ్నిమాప‌క అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Latest News