New Ration Cards Issued : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్తగా 1.55 లక్షల రేషన్ కార్డులు జారీ చేశారు. కార్డులు మంజూరైన వారికి ఈ నెల 25 నుంచి మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు చేరనున్నాయి. అందులో రేషన్ కార్డు నంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. గ్రామసభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేశారు.
కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో 3 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలకు 1.89 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానుంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తాయి. అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. కార్డులో పేరు ఎక్కించడం, పాత కార్డులో పేరు తొలగిచండం వంటివి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డు నంబర్ ఉన్నవారు ఆన్ లైన్లో స్టేటస్ తెలుసుకోవచ్చు.