Site icon vidhaatha

నేటి నుంచే కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఇక లైన్ దాటితే బాదుడే!

విధాత‌, హైదరాబాద్‌: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నేటి నుంచి కొత్త ట్రాఫిక నిబంధనలు ఆపరేషన్‌ ‘రోప్‌’ అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌లైన్‌ దాటితే రూ.100 జరిమానా విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.వెయ్యి జరిమానా వేస్తారు.

ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు ఆక్రమిస్తే భారీ జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే రూ. 600 జరిమానా విధిస్తామని ట్రాఫి్క పోలీసులు అంటున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరుతున్నారు.

అంతేకాదు, బైకర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా, కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్టు ధరించకున్నా, అతి వేగంతో ప్రయాణించినా, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినా చర్యలు కఠినంగా ఉంటాయని అధికారలు తెలియజేశారు. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించడం ద్వారా జరిమానాలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

హైదరాబాద్‌ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అంతకుముందు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడే వారు కూడా కొవిడ్ తర్వాత సొంత వాహనాలను అలవాటు పడ్డారు. దిగువ మధ్య తరగతి కూడా తంటాలు పడి సొంత వాహనం కొనుక్కున్న వారూ ఉన్నారు.

దీంతో ప్రస్తుతం నగరంలో రోజు దాదాపు 77.5 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కలో తేలింది. 2019తో పోలిస్తే ఏకంగా 18 శాతం పెరిగాయి. బైక్ లే అత్యధికంగా దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయి. మరో 14 లక్షల కార్లు ఉన్నాయని పోలీసుల అధ్యయనంలో తేలింది.

అయితే, సాధారణ జనాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఈ ట్రాఫిక్ సమస్యపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ సమస్య పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా చెప్పారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్‌ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. భవిష్యత్తు కోసం రూపొందించిన ట్రాఫిక్‌ పోలీసుల యాక్షన్‌ ప్లాన్‌పై కూడా వివరించారు.

నేడు న‌గ‌రంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ టైంలో ఆ చుట్టు పక్కలకు వెళ్లొద్దు!

సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీస్టేడియంలో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో పరిస్థితిని బట్టి ట్రాఫిక్‌ను మళ్లించడం, నిలిపివేయడం చేస్తామన్నారు. బషీర్‌బాగ్‌, పీసీఆర్‌ జంక్షన్‌, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, నారాయణగూడ, హమాయత్‌నగర్‌, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల, అంబేద్కర్‌ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్‌, బైబిల్‌ హౌస్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట జంక్షన్ల నుంచి నిర్ణీత సమయంలో రాకపోకలు కొనసాగించకపోవడం మంచిదని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని జాయింట్‌ సీపీ కోరారు.

Exit mobile version