Site icon vidhaatha

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా

విధాత, హైదరాబాద్ : కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నేను పోటీ చేస్తానని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చెల్లి లాస్య నందితను అంతా కష్టపడి గెలిపించుకున్నారని, ఆమె అనుకోకుండా కారు ప్రమాదానికి గురై మనందరిని వీడివెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లాస్య నందిత గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, అందరి సమిష్టి నిర్ణయం మేరకు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. సికింద్రాబాద్ కంటొన్మెంట్ నుంచి తన తండ్రి గడ్డం సాయన్నను, చెల్లి లాస్య నందితను ఆదరించి గెలిపించిన ప్రజలు వారి ఆశయ సాధనకు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

Exit mobile version