యుద్ధమే అనుకుని చేయండి..సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌.. మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల ముగింపునకు ముందు ఉత్తర కొరియాలో

  • Publish Date - March 14, 2024 / 04:30 PM IST

ప్యోంగ్యాంగ్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌.. మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల ముగింపునకు ముందు ఉత్తర కొరియాలో నూతన సైనిక ప్రదర్శన నిర్వహించారు. దీనికి నాయకత్వం వహించిన కిమ్‌.. ఈ సందర్భంగా కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలను నిజమైన యుద్ధంలో భాగంగా చూడాలని ఆదేశించడం గమనార్హం. ఒక్క కొత్త యుద్ధ ట్యాంకు తన మొదటి ప్రదర్శనలోనే విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించిందంటూ కమాండర్లను అభినందించారు. ఈ విన్యాసాలకు సంబంధించిన వివరాలను కొన్ని మీడియాల్లో వచ్చాయి. యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకేసారి తమ ప్రత్యర్థి లక్ష్యాలపై దాడి చేస్తాయని అందులో తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటు.. రక్షణ మంత్రి, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక మరో ఫోటోలో కిమ్ జోన్ లెదర్ జాకెట్ ధరించగా కమాండర్లు అతను చుట్టూ ఉండటం కనిపించింది. ఉత్తరకొరియా జండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా కనపడుతున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు నిర్వహించింది.