విధాత: 2022 -23విద్యాసంవత్సరానికి సంబంధించి నల్గొండ నాగార్జున కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గణ శ్యామ్ తెలిపారు.
తెలుగు- రెండు, అర్థశాస్త్రం -మూడు, కామర్స్- నాలుగు, జంతుశాస్త్రం- మూడు, రసాయన శాస్త్రం- మూడు, కంప్యూటర్ సైన్స్- మూడు, గణితం -ఒకటి , స్టాటిస్టిక్స్ -ఒకటి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్- ఒకటి, ఆంగ్లం- రెండు పోస్టులు చొప్పున ఖాళీగా ఉన్నాయని, అధ్యాపకుల నియామకం సిసిఈటిఎస్ నిబంధన ప్రకారం జరుగుతుందన్నారు.
అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి సంబంధిత సబ్జెక్టులలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీలకు 50% మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. పిహెచ్ డి, నెట్, సెట్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
బోధన అనుభవం ఉన్నవారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వన్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 28లోగా అన్ని అర్హత సర్టిఫికెట్లతో బయోడేటా ఫారంను కళాశాల కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు స్థానిక ఎన్జీ కళాశాలలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.