Site icon vidhaatha

Bear | కరీంనగర్‌లో ఎలుగుబంటి కలకలం

Bear | విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ (karimnagar) జిల్లా కేంద్రం శివారు కాలనీలోకి ఆదివారం అర్ధరాత్రి ప్రవేశించిన ఎలుగుబంటి జనాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఎలుగుబంటిని గుర్తించిన యువకులు తెల్లవార్లు కర్రలతో కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని రజ్వీచమన్, శ్రీపురం కాలనీలలో కనిపించిన ఎలుగుబంటి, తెల్లవారుజామున రేకుర్తి గ్రామంలోని దాసరి గార్డెన్ లో ప్రవేశించింది.

ఇందుకు సంబంధించి సిసి కెమెరాల (CCTV) వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అయ్యాయి. ఎలుగుబంటిని పట్టుకునేందుకు పోలీసు, అటవీశాఖ అధికారులు వలలు వేసి 12 గంటల ప్రయాస అనంతరం మత్తు ఇంజక్షన్ ఫైరింగ్‌తో బంధించారు.

ఎలుగును పట్టుకునే క్రమంలో బెదరిపోయి అది పలుసార్లు అటవీ, పోలీస్ సిబ్బందిపై దాడి చేయబోయింది. చివరకు మత్తు ఇంజక్షన్ సహాయంతో బంధించిన ఎలుగుబంటిని హైదరాబాద్ జూకు తరలించారు.

Exit mobile version