Site icon vidhaatha

Viral: బావిలో పడ్డ‌ ఎలుగుబంటి.. ప్రొక్లెయినర్‌తో బయటకు.! (Video)

Viral | Bear

విధాత: బావిలో పడిన ఓ ఎలుగుబంటి మనుషులు అందించిన సహకారాన్ని తెలివిగా అందిపుచ్చుకుని క్షేమంగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. బావిలో ఉన్న ఎలుగుబంటిని గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అధికారులు బావీ ప్రొక్లెయినర్ తో పాటు నిచ్చెనతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ముందుగా బావి నీళ్లలో ఎలుగుబంటి సేఫ్ గా ఉండేలా బావిలోకి ఓ తాడు వేయగా..దానిని పట్టుకుని అది బావి దరిన సహాయం కోసం ఎదురుచూసింది. రెస్క్యూ టీమ్ మెల్లగా బావిలోకి ఓ నిచ్చెన వేయగా ఎలుగుబంటి దానిపైకి ఎక్కింది.

మెల్లగా నిచ్చెనను ప్రొక్లెయినర్ తో పైకి జరుపుతూ పైకి తేగా..నిచ్చెన ద్వారా పైకి వచ్చిన ఎలుగుబంటి బావిలోంచి బయటపడి అడవిలోని పరుగు తీసింది. వన్యప్రాణియైన ఎలుగుబంటి మనుషుల సహకారాన్ని అర్దం చేసుకుని క్షేమంగా బయటపడిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.

Exit mobile version